ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాలకు తీపి కబురు: ఇంటింటికీ కుళాయి నీటి కోసం రూ.860 కోట్లు మంజూరు!

అనంతపురం జిల్లా ఉరవకొండ

*ఉరవకొండ నియోజకవర్గానికి ఇంటింటికి త్రాగునీటి పథకం.. రూ.480 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం..*

*ఇంటింటికి త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి (ట్యాప్) ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమం కోసం రూ.480 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రివర్గం (క్యాబినెట్) ఈరోజు ఆమోదించింది.*

*ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా – ఈ పథకం అమలుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేకంగా కృషి చేశారు.*

*అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా ఇంటింటికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో రూ.380 కోట్లు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది.*

Posted Under AP
Editor