Latest Posts

మహిళల్ని వేధింపుల నుంచి రక్షిస్తున్న దిశ యాప్ – తాజా ఉదాహరణలివే..

ఏపీలో మహిళల్ని వేధింపుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షించేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ యాప్ ఇప్పుడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది.

దిశ యాప్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వందల సంఖ్యలో మహిళల్ని క్షణాల్లో రక్షిస్తున్న ఉదంతాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. తాజాగా దిశ యాప్ ద్వారా మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా శిక్షిస్తున్న ఉదంతాలు కూడా పెరుగుతున్నాయి.

తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో లోన్ యాప్ వేధింపుల నుండి తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు దిశ పోలీసులను ఆశ్రయించింది. గుడివాడ లోని దానియాలపేట లో నివాసం వుండే ఓ మహిళ ఈ నెల 13 వ తేదీన “మై లోన్ యాప్” నుండి 7,500 రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే అంటే 19వ తేదీన తీసుకున్న అప్పును వడ్డీతో సహా మొత్తం చెల్లించింది. రెండు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తి తనకు కాల్ చేసి వేదిస్తున్నట్లు బాధితురాలు దిశకు ఫిర్యాదు చేసింది. వివిధ ఫోన్ నంబర్ల నుండి ఆగంతకుడు కాల్ చేసి అదనంగా డబ్బులు కట్టాలని వేదిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన దిశ పోలీసులు బాధితురాలికి ఇంటికెళ్లి భరోసా కల్పించారు.

అలాగే కాకినాడ సర్పవరం లోని పోస్టల్ కాలనీ లో వీరబాబు అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నట్లు బాధితురాలు దిశ SOS కు కాల్ చేసింది. వెంటనే అలెర్ట్ అయిన దిశ టీం కానిస్టేబుల్, హోం గార్డ్ లను సంఘటనా స్థలానికి పంపించింది. కేవలం 5 నిముషాల వ్యవధిలో బాధితురాలి లోకేషన్ కు దిశ పోలీసులు చేరుకున్నారు. పోలీసుల రాకను కనిపెట్టిన వీరబాబు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.

YES9 TV