సోదర భావానికి ప్రతీక పవిత్ర రంజాన్ జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్.

అనంతపురం, మార్చి 13
పవిత్ర రంజాన్ మాసం సోదరభావానికి ప్రతిరూపమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపం (కృష్ణ కళామందిరం) లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అనంత రెవెన్యూ క్రీడా మరియు స్పోర్ట్స్ అసోసియేషన్, అనంత రెవెన్యూ ఉద్యోగుల రుణ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ప్రప్రదమంగా రెవెన్యూ ఉద్యోగ ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి ,విష్ణు చరణ్, డిఆర్ఓ మా లోల , రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్, ఆనంద్, అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక నమాజు, దువా ప్రార్థనలు జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రేమ, కరుణా ,శాంతి ,సహనం దాతృత్వం లాంటి ఆచరణలు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉంటాయన్నారు. సమాజంలోని ప్రతి ముస్లిం ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో 30 రోజులపాటు కఠోర దీక్షలను పాటించడంస్ఫూర్తిదాయకమన్నారు. ప్రప్రదముగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమైనదన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ముందస్తుగా ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
డిఆర్ఓ మాలోల మాట్లాడుతూ క్రమశిక్షణ మారుపేరుగా సమానత్వం, ధార్మిక చింతనకు మార్గదర్శిగా పవిత్ర రంజాన్ మాసం నిలుస్తోందని, విశ్వ మానవ కళ్యాణ కోసం విశ్వ ప్రభువును ప్రార్థించే పవిత్రమైన మాసం రంజాన్ అన్నారు.
ఇది సమాజంలోని బీద సాధన పట్ల సానుభూతి వహించాలని నిర్దేశిస్తుందని తెలిపి అందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా అనంతపురం జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి గొప్ప కార్యాన్ని చేపట్టడం ఎంతో ఆదర్శనీయమైందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఏటా అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల వల్ల నైతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కనిపిస్తాయని ముఖ్యంగా మనుషులు ఆత్మ విగ్రహం శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు పవిత్ర రంజాన్ మాసంలో దైవ విధేయతను చాటుకుంటారని 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల సాధన వల్ల దైవ ప్రసన్నతను పొందుతార న్నారు. ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్.ఎం.దివాకర్ రావు, సత్య సాయి జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, స్పోర్ట్స్ వన్ కల్చరల్ అధ్యక్షులు సంజీవరెడ్డి శ్రీనివాసమూర్తి రాష్ట్ర నాయకులు సోమశేఖర్, జిల్లా మైనార్టీ శాఖ అధికారి రామ సుబ్బారెడ్డి, రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పలువురు ముస్లిం మత పెద్దలు రెవెన్యూ ఉద్యోగ ఉపవాస దీక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor