: పాపులర్ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ (Twitter)కు మరిన్ని ఫీచర్లు యాడ్ కానున్నాయి. ఈసారి ట్విట్టర్‌లో వీడియోలకు రెండు ముఖ్యమైన సదుపాయాలు రానున్నాయి.
ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. వచ్చే వారంలో ఈ రెండు ఫీచర్లు వస్తాయని తెలిపారు. ట్విట్టర్‌కు పిక్చర్ ఇన్ పిక్చర్ (PiP) యాడ్ కానుందని మస్క్ వెల్లడించారు. అలాగే 15 సెకన్లు ఫార్వర్డ్, 15 సెకన్ల బ్యాక్ సీక్ చేసేందుకు వీడియోపై బటన్స్ వస్తాయని తెలిపారు. పూర్తి వివరాలు ఇవే.
Twitter New Features: “వచ్చే వారంలో, పిక్ ఇన్ పిక్ వస్తోంది. అంటే స్క్రోలింగ్ చేస్తూనే మీరు వీడియో చూడొచ్చు” అని మస్క్ చెప్పారు. వీడియో చూస్తున్నప్పుడు 15 సెకన్ల ఫార్వర్డ్, బ్యాక్ సీక్ బటన్లను యాడ్ చేయాలని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. పిక్చర్ ఇన్ పిక్చర్‌తో పాటు వచ్చే వారంలో ఇది వస్తుందని మస్క్ రిప్లై ఇచ్చారు.
Twitter New Features: పేజీలో కిందికి స్క్రోల్ చేసినా.. ఓ కార్నర్‌లో చిన్న విండోలో వీడియో ప్లే అవడమే ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్. ప్రస్తుతం వాట్సాప్, యూట్యూబ్ సహా చాలా యాప్‍ల్లో ఈ ఫీచర్ ఉంది.
Twitter New Features: ఫార్వార్డ్, బ్యాక్ సీక్ బటన్లు యాడ్ అయితే.. ఆ బటన్స్ క్లిక్ చేసి వీడియోను 15 సెకన్లు ఫార్వార్డ్ చేయడం, బ్యాక్‍కు వెళ్లడం చేయవచ్చు.
Twitter New Features: పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్‌ను ప్రకటింటంతో మస్క్‌ను చాలా మంది యూజర్లు అభినందించారు. “ధన్యవాదాలు. ఈ ఫీచర్ రావాలని నేను చాలా కోరుకున్నా. ఇదే తక్కువ ఉందని అనుకున్నా” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. “ట్విట్టర్‌లో మల్టీటాస్క్ కు ఇది వెల్‍కమ్ ఫీచర్‌గా ఉండనుంది” అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Twitter New Features: ట్విట్టర్‌కు లిసెన్ ఓన్లీ (Listen Only) మోడ్‍ను తీసుకురావాలని ఓ యూజర్ సూచించారు. “స్కీన్ ఆఫ్‍లో ఉన్నప్పుడు కూడా వినగలిగేలా లిసెన్ ఓన్లీ మోడ్‍ను కూడా యాడ్ చేయండి. ఇది పోడ్‍కాస్ట్‌లకు బెస్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ కూడా తేవాలి” అని ఆ యూజర్ కామెంట్ చేశారు.
Twitter New Features: కాగా, ట్విట్టర్‌లో త్వరలో వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఫోన్ నంబర్ లేకుండానే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఏ యూజర్‌తో అయినా మాట్లాడవచ్చని చెప్పారు.
బ్లూ వెరిఫైడ్ సబ్‍స్కైబర్లు ఇక నుంచి 2 గంటల నిడివి వరకు ఉన్న వీడియోలు అప్‍లోడ్ చేయవచ్చని ట్విట్టర్ ఇటీవల ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్ చాలా మార్పులు చేశారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.