Latest Posts

సెలబ్రెటీల గురించి సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కామన్ విషయం.

సెలబ్రెటీల గురించి సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కామన్ విషయం. అలాగే సెలబ్రెటీల గురించి తప్పుడు వార్తలు రావడం కూడా కామన్ విషయం. అయితే కొన్ని సార్లు ట్రోల్స్ మరియు తప్పుడు వార్తలు హద్దు మీరుతూ ఉంటాయి.

అలా హద్దు మీరిన సమయంలో సదరు సెలబ్రెటీ స్పందించడం జరుగుతుంది.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్‌ మనవరాలు.. ఐశ్వర్య రాయ్‌ – అభిషేక్ బచ్చన్‌ కూతురు ఆరాధ్య బచ్చన్‌ తనపై ఒక యూట్యూబ్‌ ఛానల్ చేస్తున్న అసత్య ప్రచారం గురించి కోర్టును ఆశ్రయించింది. గత కొన్నాళ్లుగా సదరు యూట్యూబ్‌ ఛానల్ లో ఆరాధ్య గురించి హద్దు మీరి పుకార్లు ప్రచారం చేస్తున్నారట.

ఆరాధ్య బచ్చన్‌ పిటీషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. యూట్యూబ్‌ ఛానల్‌ కు చెందిన వారిని ప్రతివాధులుగా చేర్చడం జరిగింది. గతంలో యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిపై అభిషేక్ బచ్చన్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు. తన కూతురు గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని.. కావాలంటే తన గురించి ఎలాంటి ప్రచారం అయినా చేసుకోమని ఆయన కోరాడు. అయినా కూడా వారు ఆరాధ్య గురించి తప్పుడు వార్తలు ఆపలేదు. దాంతో ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

YES9 TV