Latest Posts

కేజీబీవీ తాడిమర్రిలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

తాడిమర్రి (yes9tv)కేజీబీవీ తాడిమర్రిలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్
తాడిమర్రి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడనున్నాయి.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రతి కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరానికి 40 సీట్లు చొప్పున ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అలాగే 7, 8, 9, 10 తరగతులు మరియు ఇంటర్‌ రెండవ సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం కూడా ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి.
దరఖాస్తులు కేవలం ఆన్లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థులు https://apkgbv.apcfss.in⁠� వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆన్లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్‌ కోసం పరిగణించబడతాయి.
ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్‌ 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 13 నుండి 17వ తేదీ వరకు సంబంధిత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో విద్యార్థినుల ధ్రువపత్రాలను పరిశీలించి తరగతుల వారీగా సీట్లు కేటాయించబడతాయని ప్రిన్సిపాల్‌ శ్రీమతి A. వాణిశ్రీ తెలిపారు.

Posted Under AP
Editor