విషపు మొక్కలు తిని రెండు ఎద్దులు మృతి: డాక్టర్ రామేశ్వరరావు…

ముదిగుబ్బ yes9 TV
మండలంలోని ఇందుకూరు గ్రామంలో విషపూరిత మొక్కలను తినడం వల్ల రెండు ఎద్దులు మృతి చెందినట్లు పశువైద్యుడు డాక్టర్ రామేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో పొలాలు, గట్లు, పచ్చిక బయళ్లలో పెరిగే కొన్ని విషపూరిత మొక్కలను పశువులు తినే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు పశువులను మేపే ముందు పరిసరాలను పరిశీలించి, విషపు మొక్కలను తొలగించాలని సూచించారు.
పశువులు మేత తిన్న తర్వాత అస్వస్థతకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పశువైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ రామేశ్వరరావు రైతులకు సూచించారు. అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Posted Under AP
Editor