శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం. రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ.
రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.
ముస్లిం లతో కలసి ఇప్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
ముస్లిం మైనార్టీ సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ రంజాన్ అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. నల్లమాడ మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులు మంగళవారం ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ , ముస్లిం లకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు
ముస్లిం మైనార్టీలు ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలు కొనసాగించి ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి 2017 వరకు అల్లా ఆశీస్సులతో హిందువునైన తనకు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అవకాశం ఇచ్చిందుకు సీఎం కు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండల కూటమి పార్టీల నాయకులు టీడీపీ మండల నాయకులు. కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
