తాడిమర్రిyes9 tv మండలంలో యూరియా కొరత లేదు – వ్యవసాయ శాఖ
పత్రికా ప్రకటన:
తాడిమర్రి మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు ఈరోజు తనిఖీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సరఫరా చేసిన యూరియా, అమోనియా, సూపర్ కాంప్లెక్స్ తదితర ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు లైసెన్సులో పేర్కొన్న విధంగా సరైన నిల్వలతో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుత సాగు సీజన్‌కు అవసరమైనంత మేర ఎరువులు అన్ని దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా యూరియా లేదా ఇతర ఎరువుల కృత్రిమ కొరత కనిపించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే రైతులు ఎరువులు లేదా క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా చెల్లింపు రసీదులను తీసుకొని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇందులో భాగంగా ఈరోజు తాడిమర్రిలోని స్థానిక మన గ్రోమోర్ కేంద్రంను కూడా అధికారులు సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా ఎరువుల నమూనాలను సేకరించి రసాయన పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపుతున్నట్లు తెలిపారు.
తాడిమర్రి మండలంలో ఎరువుల తనిఖీలు: యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ స్పష్టీకరణ
