ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్

ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది. షెడ్యూల్‌ వచ్చినప్పటినుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో..

కీలక పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగానే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని మిజోరాం రాష్ట్రానికి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు ఇతర నేతలకూ కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్‌ ఆంటోనీ, నాగాలాండ్‌ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్‌లు మిజోరాం ఎన్నికలకు పార్టీ కో-ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని బీజేపీ తెలిపింది.

 

మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెలిచింది. జెడ్‌పీఎం 8 స్థానాల్ని కైవసం కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఒక సీటు మాత్రమే సొంతం చేసుకున్నాయి. ఈసారి మిజోరాంలోనూ సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ తనదైన వ్యూహాలు రచిస్తోంది. అటు.. జతీందర్ పాల్ మల్హోత్రాను పార్టీ ఛత్తీగఢ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించింది.

YES9 TV