టీడీపీ కార్యకర్త కుటుంబానికి మాజీ మంత్రి పల్లె భరోసా: ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న డాక్టర్ రఘునాథ్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడలో టీడీపీ కార్యకర్త గంగప్ప కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె పరామర్శ

పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అధైర్య పడవద్దు అని అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. నల్లమాడ మండల కేంద్రంలో నివాసం ఉన్న పులగంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగాద్రి (గంగప్ప ) కుటుంబాన్ని శనివారం మాజీ మంత్రి పరామర్శించారు. ఆనారోగ్యంతో బాధపడుతూ కాలు పోగొట్టుకున్న గంగప్పను , ఇటీవల కదిరిలో కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం కింద పడి కాలు దెబ్బతిన్న కుమారుడు పవన్ ఆరోగ్య పరిస్థితి ఆ కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కొంత ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి ఇల్లు ,పెన్షన్ మంజూరు చేస్తామని , అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజే విధంగా చూస్తానని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు

Posted Under AP
Editor