- అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి
- అభివృద్ధికి చిరునామా టిడిపి
- 25 లక్షల మంది తల్లుల ద్రోహి జగన్
ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు రాయదుర్గం మండలం 74 ఉడేగోళం శ్రీ మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.పేర్కొన్నారు.రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి – సంక్షేమం పేరుతో ఈనెల 27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన టిడిపి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం సహకారంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగుతోందన్నారు. టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని కోరారు. అభివృద్ధికి చిరునామా టిడిపి ప్రభుత్వమని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం పేరుతో రాష్ట్రంలోని 25 లక్షల మంది తల్లులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్రోహం చేశారని మండిపడ్డారు.
బైట్స్. కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు
