నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’.. అన్నమయ్య, శ్రీరామదాసుకు పూర్తి భిన్నంగా!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌ అనగానే భక్తిరస చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విజయాల తర్వాత వచ్చిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’పై కూడా అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ‘ఓం నమో వేంకటేశాయ’ కథనం మాత్రం గత రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హాథీరామ్‌ బావాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాథీరామ్‌ బావాజీకి సంబంధించిన చారిత్రక వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో.. దర్శకుడు రాఘవేంద్రరావు తనదైన కథనంతో సినిమాను రూపొందించారు.

ఈ సినిమాలో భక్తితో పాటు వైరాగ్య కోణాన్ని కూడా ప్రత్యేకంగా ఆవిష్కరించారు. భగవంతుడిపై భక్తుడికి ఉండే అచంచలమైన విశ్వాసం, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నాగార్జున తన నటనతో తెరపై చూపించారు. దీంతో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల కంటే భిన్నమైన భక్తిరస అనుభూతిని ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రేక్షకులకు అందించింది.

Editor