వాల్మీకి సురేంద్ర (TDP సూరి) కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు

గౌరవనీయులైన ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

టీడీపీ పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేసిన మా తమ్ముడు వాల్మీకి సురేంద్ర (TDP సూరి) గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి మా కుటుంబానికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తూ, నిన్న ఆలూరు నియోజకవర్గంలో జరిగిన సంజీవిని కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి మా కుటుంబ సమస్యను వివరించి, అత్యంత చొరవతో, వ్యక్తిగతంగా ముందుండి ప్రయత్నాలు చేసి మా కుటుంబానికి న్యాయం జరిగేలా కీలక పాత్ర పోషించిన ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.

అలాగే, ఈ విషయంలో మా కుటుంబానికి అండగా నిలిచి, సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఇట్లు,
వాల్మీకి సురేంద్ర (సూరి) కుటుంబ సభ్యులు.. 🙏🙏

Posted Under AP
Editor