స్వామీ వీరభద్రా..ఏమిటీ ఘోరం.!

స్వామీ వీరభద్రా..ఏమిటీ ఘోరం.!

ఉండబండ వీరభద్రస్వామి దేవస్థానం సమీపంలో పేకాట..!

Yes 9 tv

ఉరవకొండ, ప్రతినిధి:
ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం ఉండబండ గ్రామంలో ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయానికి సమీపంలో టెంట్లు ఏర్పాటు చేసి, లక్షల రూపాయలతో జూదం సాగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం, అనంతపురంతో పాటు తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పలువురు జూదరులు ఇక్కడికి వస్తున్నట్లు చెబుతున్నారు. జూదం కోసం ప్రత్యేకంగా టెంట్లు, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారని, వడ్డీపై నగదు ఇచ్చే వ్యక్తులు కూడా అక్కడే అందుబాటులో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో స్థానిక పోలీసుల సహకారం ఉందని, కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఛిద్రమవుతున్న కుటుంబాలు..!

జూద వ్యసనం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, అప్పుల పాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ మాయలో చిక్కుకుని తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు.

భక్తులకు ఇక్కట్లు..!

వీరభద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లో, సమీపంలోని కాలువ పక్కన ఏకంగా తాత్కాలిక టెంట్లు వేసి పేకాట నిర్వహిస్తున్నారు. ఫలితంగా
భక్తుల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని, దేవస్థానం పవిత్రత దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, జూదరులకు రాజకీయ నాయకులు సహకరిస్తున్నారా? లేక కొందరువపోలీసులు, చోటా నాయకులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపిస్తున్నారా? అనే వివరాలతో మరో సంచికలో ప్రచురిస్తాం.

Posted Under AP
Editor