తాడిమర్రి( yes9tv)తాడిమర్రి మండలం పుల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు గొడ్డుమర్రి వెంకటేష్ (తండ్రి: జి. వెంకటరాముడు – మరణించారు) వెంకటేస్ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు.
వెంకటేష్ తనకు ఉన్న సుమారు 5 ఎకరాల భూమిలో నల్ల కళింధర పంట సాగు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు అలాగే మొత్తం అప్పు 10 లక్షల దాకా ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొన్ని కారణాల వల్ల పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు వెంటనే బత్తలపల్లిలో ని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
మృతుడికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వెంకటేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రైతు మృతి – కుటుంబంలో విషాదం..
