అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జేసీబీ,5 ట్రాక్టర్ సీజ్…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

బొమ్మనహాళ్ మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై బొమ్మనహాళ్ పోలీసులు కోరడా గుళిపించారు. శనివారం వేదావతి హగరి నదిలో గుట్టుచప్పుడు కాకుండా జీబీసీతో ఇసుకను తవ్వుతూ ట్రాక్టర్లుతో అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వేదావతి హగరి నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకొని 6 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కేఏ34జీద్4862 నంబర్ గల కల్లుదేవనహాళ్లి గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ బోయ మల్లికార్జున, 5 మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉరవకొండ మండలం బుడిదగవ్వి గ్రామానికి చెందిన వద్దే రాంబాబు, ఉండబండ గ్రామానికి చెందిన బంగి చందు, కల్లుహోళ గ్రామానికి చెందిన కాకుల వన్నూరుస్వామి, కుమ్మరి నాగేంద్ర, బోయ వన్నూరుస్వామిలను అరెస్టు చేసిన్నట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి జేసీబీ, ట్రాక్టర్లును సీజ్ చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను త్వరలో రాయదుర్గం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు తహశీల్దార్ వద్ద అనుమతి తీసుకుని వచ్చి ఇస్తే కూలీలతో తరలించడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. జేసీబీలతో వేదావతి హగరి నదిలో ఇసుసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Posted Under AP
Editor