కనికిలమ్మ ఆలయం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించా -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు:

దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ దేవాలయంలో పూజ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం సప్త కనికలమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ తో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.. చిత్తూరుకు మంచి చేయాలని మనస్పూర్తిగా అమ్మవారిని వేడుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులు, చిత్తూరు ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా గెలిచినట్లు చెప్పారు. దొడ్డిపల్లిలోనే ఇల్లు నిర్మించుకుంటున్నానని.. ఇకపై మా ఊరి దేవత కూడా సప్తగిరి కనికలమ్మేనని చెప్పారు. దొడ్డిపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. సందర్భంగా సప్తగిరి కనికలమ్మ దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా బాలాజీ, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, సభ్యులు గోపాలకృష్ణ, నాయకులు వెంకటేష్ యాదవ్, నళిని, తిరుకుమరన్, నాగరాజు, టీడీపీ నగర కమిటీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor