ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ….

చిత్తూరు:

నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి మామిడి భవనంలో శనివారం నిర్వహించిన ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన డైరీని వారు ఆవిష్కరించారు. అనంతరం సభ్యులకు ఐడీ కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, నగర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor