టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్లో ఉండేవి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు చాలా చోట్ల.
తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్లు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాయంటే సాధారణ విషయం కాదు. రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 రూపాయల ధర ఉంటే ఇక రిటైల్ మార్కెట్‌లో క్వాలిటీ బట్టి 200 రూపాయల కంటే పైనే అమ్మేసుకున్నారు వ్యాపారులు. కొన్ని రోజులైతే చాలా చోట్లో టమాటాలు అసలు కనుమరుగైపోయాయి. కానీ రెండు మూడు రోజుల నుంచి టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటా ధరలకు బ్రేక్ పడింది.. గత రెండు నెలల నుంచి చుక్కలు చూపిస్తున్న టమాటా.. మిడిల్ క్లాస్ జనానికి అందుబాటులోకి వచ్చింది. వర్షాలు తగ్గడంతో మార్కెట్‌కు టమాటా దిగుమతులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబార్‌కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. 1st క్వాలిటీ టమాట రూ.100, 2nd క్వాలిటీ అయితే రూ. 80, 60. అమాంతం పడిపోయిన టమాట ధరలతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెలాఖరు వరకు ధరలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో రూ.50…
కాగా హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది. ఈ కారణంగానే కిలో రూ.100లోపుకు దిగి వచ్చింది. ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో ధర 50కు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విజయవాడలో రైతుబజార్లలో కిలోటమాటా రూ. 80 కు తక్కువగానే లభించింది. మొత్తానికి టమాట ధరలు తగ్గుముఖం పడుతుండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కూరల్లో టమాటను వాడేయొచ్చని సంతోషం వ్యక్తం చేశారు.