హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు.

20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌ (18046), సికింద్రాబాద్ -షాలిమార్‌(12774), విల్లుపురం-ఖరగ్‌పూర్‌(22604), హౌరా-ఎస్‌ఎంవీ బెంగళూరు(22887) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎస్‌ఎంవీ బెంగళూరు- హౌరా (22864), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- షాలిమార్‌(22826).. 22వ తేదీన పాట్నా-ఎర్నాకుళం(22644), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- సంత్రాగచ్చి(22808) రైళ్లను రద్దు చేశారు. ఈనెల 25వ తేదీవరకు విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

(17239) గుంటూరు -విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 నుంచి 25వ వరకు.. అలాగే రైలు నంబరు. (17240) విశాఖపట్టణం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ నెల 21న (07629) విజయవాడ – తెనాలి, (07874) తెనాలి – రేపల్లె, (07875) రేపల్లె – తెనాలి, ఈ నెల 22వ తేదీన (07282) తెనాలి – గుంటూరు, 24వ తేదీన (07783) విజయవాడ – గుంటూరు రైళ్లను రద్దుచేశారు.

YES9 TV