గంగాధర నెల్లూరు:
ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ మరియు గంగాధరనెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షులు షణ్ముగ రెడ్డితో కలిసి ఆయన గంగాధర నెల్లూరులో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 47 మంది బాధితులకు సుమారు రూ. 48 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. షణ్ముగ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
