Latest Posts

14 ఏళ్ల బాలికలకు హెచ్‌.పి.వి టీకా అత్యంత అవసరం..ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు…

రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపులోమ వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు. మొదట ఆయనకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా 14 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అలాగే జననేంద్రియ మొటిమలు మరియు క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిరోధించడంలో కూడా ఇది సహాయపడుతుందన్నారు.
ప్రభుత్వం పది వేల ఇంజెక్షన్లను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు.

Posted Under AP
Editor