ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈరోజు టీవీ స్టేషన్ దగ్గర చిన్నారి పాపకు మరియు వారి తండ్రికి యాక్సిడెంట్ జరగడానికి కారణం
గుత్తి రోడ్డు టీవీ స్టేషన్ దగ్గర రోడ్డు మరమత్తులో భాగంగా కొత్త రోడ్డు వేయడం జరిగింది అలాగే రోడ్డు కొద్దిగా వెడల్పు చేయడం జరిగింది. దీనిపై భారత రాజ్యాంగ అవగాహన వేదిక ప్రతినిధి జింకల వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డుకు సంబంధించిన అధికారులు స్పీడ్ బ్రేకులు వేయడం మరిచారు టీవీ స్టేషన్ దగ్గర ఉన్న సర్కిల్ బిజీగానే ఉంటుంది అంతేకాకుండా జమ్మి మంకాలమ్మ దేవాలయం అక్కడే ఉంది అంబేద్కర్ ప్రైమరీ స్కూల్ అక్కడే ఉంది వారంలో మూడుసార్లు గొర్రెల సంత అక్కడే జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ బ్రేకర్ తప్పనిసరిగా వేయాలి వాళ్లు వేయడం మరిచారు అయిన కూడా భారత రాజ్యాంగ అవగాహన వేదిక ఆధ్వర్యంలో గుంతకల్ మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి వినతిపత్రం సమర్పించాము రోడ్డుకు సంబంధించిన అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి ప్రాణా నష్టం కలగకుండా ముందు జాగ్రత్త తో స్పీడ్ బ్రేకర్లు వేయాలని తెలియజేశాం. అయితే నేటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు టీవీ స్టేషన్ దగ్గర ఒక చిన్న పాప తండ్రితో సహా వెళుతూ ఉంటే స్పీడ్ గా వచ్చిన లారీ వారిని గుద్ది ఆ పాప పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే చూడొచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి చిత్తశుద్ధితో పని చేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను అడిగే అంతవరకు పని చేయకుండా ఉండకూడదని, పని చేయించుకోవడం అంటే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు ప్రభుత్వ అధికారుల దగ్గర పని చేయించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలి లేకుంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఫోన్ చేయించి పని చేయించుకోవాలి అంతేగాని మేము ప్రజల కోసం పనిచేయాలి ప్రజల సొమ్ముతో టాక్స్ రూపంలో మేము జీతాలు తీసుకుంటున్నామని విషయాన్ని వాళ్ళు మరచి ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇలా ప్రవర్తించడం మంచిది కాదని భారత రాజ్యాంగ అవగాహన వేదిక డిమాండ్ చేస్తూ ఉంది
