కార్వేటినగరం:
మండలంలోని పొన్నగల్లు గ్రామంలో ఆక్రమణ గురైన కాలువ పరంబోకు భూములను సర్వే చేసి గ్రామస్తుల సమక్షంలో తాసిల్దార్ ఆక్రమణలను తొలగించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
మండలంలోని పొన్నగల్లు గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 163 లో కాలువ పరుంబోకు భూములకు సంబంధించి ఆక్రమణకు గురైన 0.91 సెంట్ల భూమి ఆక్రమణలను తాసిల్దార్ కే నాగరాజు మరియు ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. పొన్నగల్లు గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కనే కాలువ పరంబోకుగా నమోదు కాబడిన సర్వేనెంబర్ 163 లో పది మంది రైతులు0.91 భూమిని ఆక్రమించుకున్నారు.దీంతో తాసిల్దార్ సర్వే సిబ్బందితో కలిసి రోవర్ ద్వారా ఆక్రమణలను గుర్తించి ఆక్రమణకు గురైన భూములను జెసిబి ల ద్వారా తొలగించారు. ఆక్రమణకు గురైన కాలవ పరంబోకు భూములను గుర్తించి తొలగించడం పట్ల గ్రామస్తులు తాసిల్దార్ నాగరాజు కృషిని అభినందించారు. ఇందులో ఎస్సై తేజస్విని హెడ్ కానిస్టేబుల్ యువరాజు ఆర్ ఐ నరసింహులు వీఆర్వో భరత్ సాయి సర్వేయర్ మురళి వీఆర్ఏ మురుగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
