మద్దెలచెరువులో దారుణం: అరటి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

తాడిమర్రి (Yes9tv)మద్దెలచెరువులో అరటి తోటకు నిప్పుపెట్టిన దుండగులు
రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికి సుమారు రూ.10 లక్షల నష్టం
తాడిమర్రి మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికు చెందిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామ శివారులో ఉన్న ఆయనకు చెందిన దాదాపు రెండు ఎకరాల అరటి తోటను అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తోటలో ఉన్న అరటి చెట్లు పూర్తిగా కాలిపోవడంతో రైతుకు సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డి ప్రభుత్వ అధికారులు మరియు పోలీసులను ఆశ్రయించి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జరిగిన నష్టానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో మద్దెలచెరువు గ్రామంలో కలకలం రేగింది

Posted Under AP
Editor