Latest Posts

కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్య, సౌకర్యాలు అందిస్తోంది.. ఎమ్మెల్యే అమిలినేని

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం

MEGA PTM 4.0 PROGRAME

కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్య, సౌకర్యాలు అందిస్తోంది.. ఎమ్మెల్యే అమిలినేని

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎమ్ 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్ బాబు, డీఎస్పీ రవి బాబు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులకు మంచి నడవడిక, సమయపాలనను ఉపాధ్యాయులు నేర్పించాలని, తల్లిదండ్రులు పిల్లలకు సెల్‌ఫోన్లు దూరంగా ఉంచి వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికే మెగా పీటీఎమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10, ఇంటర్ చదివే గ్రామీణ విద్యార్థులకు రూ.4 కోట్ల వ్యయంతో 6,500 సైకిళ్లు అందించనున్నట్లు వెల్లడించారు.
అనంతరం పదో తరగతిలో 500 మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Posted Under AP
Editor