Latest Posts

పగా, ప్రతీకారం, విజయోత్సవ ర్యాలీలో హత్య, కొత్త ప్రభుత్వంలో కౌంట్ డౌన్ మొదలు!

బెంగళూరు/ హోస్ కోటే: కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఇంటికి వెళ్లిపోయింది. బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక సీఎం పేరు ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో అసలు కథ మొదలు అవుతుందని అందరూ అనుకున్నారు.

అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ప్రతీకార హత్యలు మొదలైనాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీ సమీపంలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే సమీపంలో బీజేపీ లీడర్ ను దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే తాలుకాలోని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం ర్యాలీలో బీజేపీ నాయకుడు హత్యకు గురైనాడు.

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే తాలుకాలోని డి, శెట్టిహళ్లిలో క్రిష్ణప్ప అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోస్ కోటే నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరత్ బచ్చేగౌడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కర్ణాటక బీజేపీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ మీద ఎమ్మెల్యేగా విజయం సాధించిన శరత్ బచ్చేగౌడకు ఆయన అభిమానులు సన్మాలు చేస్తున్నారు.

హోస్ కోటే తాలుకాలోని డి, శెట్టిహళ్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్బంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రిష్ణప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు కత్తులతో దారుణంగా పొడిచేశారు.

తీవ్రగాయాలైన క్రిష్ణప్ప ప్రాణాలు పోయాయి. క్రిష్ణప్ప కుమారుడు బాబు. అతని భార్యను దారుణంగా పడిచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిలో క్రిష్ణప్ప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. క్రిష్ణప్ప కుమారుడు బాబుతో పాటు అతని భార్యకు తీవ్రగాయాలు కావడంతో హోస్ కోటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ రెచ్చగొట్టడం వలనే బీజేపీ నాయకుడు క్రిష్ణప్ప హత్యకు గురైనాడని బీజేపీ మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు.

YES9 TV