– తిరుపతి జిల్లా పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
– తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలు మరియు మసీదుల వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.
– ప్రజలు ప్రశాంతంగా, నిరభ్యంతరంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా జిల్లా పోలీసులు సమగ్ర చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేస్తూ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేశారు.
– ప్రార్థనలు ముగిసిన అనంతరం భక్తులు సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన భద్రతా మరియు ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
– ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారు జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రతిఒక్కరు సౌహార్దం, శాంతి, సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
