2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణ ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జర్నలిస్టు ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిష. శర్మ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ముందు రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తొలి పిటిషన్ వేశారు.

ఇందులో ‘ఇండియా: మోదీ క్వశ్చన్‌’ అనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని వీరు వ్యతిరేకించారు. దీంతో పాటు పిటిషనర్లు చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ నుంచి తొలగించే అంశం కూడా లేవనెత్తింది. రెండో పిటిషన్‌ న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేశారు. తొలి పిటిషన్‌పై వాదించేందుకు సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. అత్యవసర అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం పిటిషనర్ల ట్వీట్లను ట్విట్టర్ నుంచి తొలగించిందని ఆయన అన్నారు. దీనిపై జస్టిస్ ఖన్నా హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నా ఐటీ నిబంధనల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని సింగ్ బదులిచ్చారు. సింగ్ వాదనను విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌లో జరగనుంది. ముందస్తు విచారణ కోసం కోర్టును కోరుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు డాక్యుమెంటరీని చూడకుండా అడ్డుకుంటున్నారని సీనియర్ న్యాయవాది అన్నారు. దీనిపై జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ.. ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని వినకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది.

YES9 TV