నిబద్ధతతో జనగణన ప్రక్రియను పూర్తి చేయాలి.. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్

అనంతపురం జిల్లా, టౌన్.

 

అనంతపురం, ఏప్రిల్ 10: క్షేత్రస్థాయిలోజనగణనప్రక్రియలో ప్రజల నుండి సమాచార సేకరణకువెళ్లనున్నఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ కర్తవ్య విధులను నిబద్ధతతో పూర్తిచేయాలని జిల్లా
జాయింట్ కలెక్టర్ సి .చరణ్ సూచించారు.
శుక్రవారం ఉదయం ఆర్ట్స్ కళాశాలలో ని కంప్యూటర్ కాన్ఫరెన్స్ హాల్లో జనగణన నమోదు ప్రక్రియపై జరుగుతున్న రెండవ రోజు శిక్షణా తరగతులను డిఆర్ఓ మాలోల తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం యొక్క ముఖ్య పరిపాలన సంస్థలలో జనాభా లెక్కల సేకరణ అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ విధానాల రూప కల్పనలు, ప్రజల సంక్షేమం , దేశాభివృద్ధికి ప్రణాళికలు బడ్జెట్ కేటాయింపులు మరియు సమర్థవంతమైన పాలనకు పునాదిగా ఈ జనగణన ప్రక్రియ ఉంటుందన్నారు. జనగణన 20 27నుజిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక ఆర్థిక సాంస్కృతిక స్థితిగతులు తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఇంటింటా ఖచ్చితమైన గణాంకాల వివరాలు సేకరించినప్పుడే జనగణన ముఖ్యలక్ష్యంసాధ్యమవుతుందన్నారు. ఇంటింటా సర్వే కు వెళ్ళినప్పుడుఎన్నుమరేటర్లు, సూపర్వైజర్లుప్రజలతోమర్యాదపూర్వకంగా పలకరించి వారిలో ఉన్నఅనుమానాలను సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
మరి ముఖ్యంగా ఓర్పు, నేర్పుతో ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారిని ఒప్పించి జనగణన కు సంబంధించి భారత ప్రభుత్వం నిర్దేశించిన 33 అంశాలపై పూర్తిస్థాయిలో సమాచార సేకరణ నమోదు పూర్తి చేయాలన్నారు. ఏరోజుకారోజు నమోదు ప్రక్రియ ముగిసే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మండల తాసిల్దారులు మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు ఆయా స్థాయిలో సమాచార సేకరణకు పర్యవేక్షణ చర్యలు తీసుకుని ప్రతి డేటాను పారదర్శకతతో పూర్తి చేయాలన్నారు. జనాభా గణన కార్యకలాపాలకు కచ్చితత్వం గోప్యత మరియు జవాబుదారితనం మూల స్తంభాలుగా నిలుస్తాయ న్నారు. ప్రజలు కూడా జనగణన సమాచార సేకరణకుసహకరించాలన్నారు. ఈనెల 16 నుండి ప్రజలు నేరుగా తమ వ్యక్తిగత కుటుంబ వివరాలను నమోదు చేసుకుని అవకాశం ఉంటుందన్నారు. మొదటి విడతలో ఇల్లు కుటుంబాల జాబితా ఇండ్ల గణన వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. డిఆర్ఓ మాలోల మాట్లాడుతూ ప్రస్తుతం ఈ శిక్షణ తరగతులలో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకొని అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
స్థానిక జేఎన్టీయూలో కూడా శిక్షణ తరగతులు జరుగుతున్నాయని రేపటి రోజున ముగియనున్నట్లు
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తో డిఆర్ఓ మాలోల ఇంచార్జ్ తాసిల్దార్ రాజా, సెన్సస్ విభాగం డిప్యూటీ తాసిల్దార్ మధుసూదన రావు, ఆర్ ఐ యువ తేజ, జె. ఎ. షఫీ, ఫీల్డ్ ట్రైనర్లు డా.రామచంద్ర, అహ్మద్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor