అనంతపురం నగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పై క్షేత్రస్థాయిలో పరిశీలన

అనంతపురం జిల్లా, టౌన్.

*నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్*

– *: క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

 

– *అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతోండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా సమగ్ర పరిశీలన చేశారు. శనివారం నగరంలోని వేణుగోపాల్ నగర్, గుత్తి రోడ్డు, చెరువుకట్ట రోడ్డు, పాత ఊరు బస్టాండ్, నీరుగంట వీధి, శ్రీకంఠం సర్కిల్, తదితర ప్రాంతాల్లో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి మీరు స్థానికంగా ఉంటున్నారా, పరిశుభ్రత ఎలా ఉంది, గత నెల రోజుల కిందటి కంటే ఇప్పుడుశుభ్రత బాగుందా అంటూ జిల్లా కలెక్టర్ ఆరా తీయగా, శానిటేషన్ బాగుందని ప్రజలు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.*

– *నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా, ఈ ఏడాది 11.03.26వ తేదీ నుంచి 18.07.26వ తేదీ వరకు అన్ని డివిజన్ లలోనూ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతోండగా, ఇప్పటివరకు ఒకటి నుంచి 11వ డివిజన్ల వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరగగా, ఆయా డివిజన్ లలో శానిటేషన్ డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలోగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, ఇంచార్జి ఎంహెచ్ఓ నరసింహులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor