Latest Posts

ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి ముస్లిం ఐక్య వేదిక డిమాండ్..

 

హిందూపురం:
మాట్లాడుతూ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గం నుంచి 18 మంది కౌన్సిలర్ లు వివిధ పార్టీల తరుపున గెలుపొందారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ సహృదయంతో ముస్లిం సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు.హిందూపురం పట్టణం లోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫరూఖ్ ఖాన్ అధ్యక్షతన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయo, సామాజిక వర్గాల న్యాయం రాబోవు ఎన్నికలు ముస్లిం జనాభా దామాషా దృష్టిలో పెట్టుకొని ముస్లిం సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించి ముస్లింల పట్ల తమకు ఉన్న నిబద్ధతను తెలియజేయలన్నారు
కార్యక్రమంలో మౌలానా ఫయాజ్ మౌలానా వసీవుల్లా మౌలానా తన్వీర్. ఉబేడుల్లా హుసేన్. ఫ్రూట్ రెహమాన్. అహలే సున్నత జమాత్ షౌకత్. నాహీద.అల్తాఫ్.తదితర ముస్లిం ప్రజాసంఘాలు పాల్గొన్నారు.

Editor