అనంతపురం జిల్లా, రాయదుర్గం.
మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన.
మహాత్మ జ్యోతిబాపూలే ఏ సంక్షేమాన్ని, అభివృద్ధిని అయితే ఆశించారో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దానికి పెద్దపీట వేస్తోందనీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా రాయదుర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. పేద పిల్లలు, ముఖ్యంగా అణగారిన బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని, వారు సాంఘిక దురాచారాల నుంచి బయటపడాలని జ్యోతిబాపూలే ఆశించారన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తొలగిపోవాలని ఆయన సమాజ ఉద్ధరణ కోసం కృషి చేశారన్నారు. వారి ఆశయ సాధనలో భాగంగానే నేడు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, అత్యధిక సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్నాయన్నారు. ఒకవైపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను సమర్థవంతంగా అమలు చేస్తూనే, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం విస్తృతంగా చేపడుతోందన్నారు. అలాగే, బీసీ సబ్ ప్లాన్‌కు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం సంక్షేమ పాలన అందించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కరుణ హనుమంతు, కార్పొరేషన్ డైరెక్టర్ పురుషోత్తం, మాజీ కౌన్సిలర్లు గాజుల వెంకటేషులు, మాజీ జెడ్పిటిసి కుమ్మరి మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి అగ్రహారం కిరణ్, ధనర్జున,గుద్దిటి లోకేష్, డబ్బిడి శివ, ఎస్సి సెల్ మల్లి,రావుత్ రాజశేఖర్, ఖలందర్,పైతోట అంజి, బట్టి తిప్పేస్వమి, జావేద్, నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
