భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి నారీ శక్తి అభియాన్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు బిల్లులు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమని బిజెపి కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత దేశ అభివృద్ధికి చరిత్రలో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన సంస్కరణలో తీసుకురావడం జరిగినది అందులో దేశ జనాభాలో సగానికి పైగా ఉండే మహిళా శక్తిని గుర్తించి ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది పోరాడి అలసిపోయారు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు ఆ సమస్యను గుర్తించి ఒక మంచి ఇల్లాలు ఇంటిని ఎలా అయితే చక్కబెడుతుందో అదేవిధంగా భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకునే చట్టసభల్లో మహిళలు ఉంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని భావించి మహిళలకు గత సెప్టెంబర్ 2023వ సంవత్సరంలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం జరిగినది ఈరోజు ఆ బిల్లుని చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమని యావత్ భారత దేశం లోని మహిళలందరూ ఈ విషయాన్ని కొనియాడుతున్నారు రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా నారీ శక్తి అభియాన్ పథకం తెచ్చిన నరేంద్ర మోడీ గారికి మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు స్థానికంగా వచ్చే ఎన్నికల్లో కూడా మహిళలు సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు తెలియజేశారు
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధం చేయడం చారిత్రాత్మకం: బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు
