అనంతపురం జిల్లా, టౌన్.
*మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళులు*
– *: నగరంలోని జడ్పి ప్రాంగణంలో వున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, తదితరులు..*
– *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ ప్రాంగణంలో వున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డిపీఆర్సీ మీటింగ్ హాల్ లో జయంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, ఆర్టీసీ జోనల్ చైర్మన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్, తదితరులు నివాళులు అర్పించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిబా పూలే చెప్పినది విద్యపై దృష్టి పెట్టాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహానుభావులు మహాత్మ జ్యోతిబాపూలే… ఆదర్శనీయులన్నారు. జిల్లాలో ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని, అంటరానితనం ఉన్న చోట్ల ఖచ్చితంగా సివిల్ రైట్స్ డేని నిర్వహించి అందులో తాము కూడా పాల్గొంటామన్నారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలని, బాగా చదువుకోవాలని, తన జీవితం కూడా విద్య వల్లే మారిందని, తాను ఈ స్థాయిలో ఉండేందుకు విద్య ఎంతగానో తోడ్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్, పూలే చూపిన బాటలో నడవాలన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేశామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ లలో అన్ని సీట్లు పూర్తి అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే అకడమిక్ ఏడాదిలో అన్ని సీట్లు పూర్తి చేయాలని, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు.*
– *ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి సమానంగా అవకాశాలు, హక్కులు కల్పించాలని ఆయన పోరాడారు. తన సతీమణి అయిన సావిత్రి బాయి పూలేని చదివించారని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మనమందరం సమాజానికి ఉపయోగపడేలా మెలగాలన్నారు.*
– *ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం, పేదల పట్ల ఉన్న వివక్షను రూపుమాపేందుకోసం అహర్నిశలు కష్టపడి దశాబ్దాల క్రితమే సమాజంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, ప్రతి ఒక్కరికి చదివే హక్కు ఉందని మహాత్మా జ్యోతిబా పూలే పూర్తిస్థాయిలో పోరాడి మనందరికీ మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. బిసిల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే చూపించిన మార్గంలో అందరం నడవాలని, అందరికి జ్యోతిబా పూలే శుభాకాంక్షలు తెలిపారు.*
– *ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆనాడే విద్య యొక్క ప్రాముఖ్యతను జ్యోతిబా పూలే తెలిపారని, కులవివక్ష ఉన్న రోజుల్లో ఆర్థికంగా బాగుపడాలంటే విద్య ఉండాలని తెలియజేశారన్నారు. నాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బిసిలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, సీఎం చంద్రబాబు ఎస్టీ, ఎస్సి, బిసిలకు 60 శాతం పదవులు ఇచ్చారని, మంత్రి లోకేష్ బడుగు బలహీన వర్గాలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నారని, జ్యోతిబా పూలే ఆశయాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలు 9 నియోజకవర్గాలలో ఉన్నాయని, అన్ని నియోజకవర్గాలలో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.*
– *రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే 200 సంవత్సరాల కింద జన్మించారన్నారు. జ్యోతిబా పూలే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసిలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడిందన్నారు. జ్యోతిబా పూలే జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించేలా చూశారని, కూటమి ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, బిసిలకు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.*
– *రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ బిసిల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. ఆ రోజుల్లోనే మహిళలకు చదువు ఉండాలని పోరాడారని, అసమానతలను రూపుమాపారని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు.*
– *రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, పలువురు డైరెక్టర్లు పరమేశ్వర్, లక్ష్మీ నరసింహులు, పరమేశ్వర్, ఆదినారాయణ, తదితరులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. పూలే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. మహిళలకు విద్య ఎంతో ముఖ్యమైనదని, జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు.*
– *ఈ కార్యక్రమంలో ఇంచార్జి బీసీ వెల్ఫేర్ డిడి మరియు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బారెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు ఈశ్వరయ్య, పిఎల్ఎన్.మూర్తి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ పవన్ కుమార్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి, పద్మశాలి ఫెడరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు, శాప్ డైరెక్టర్ బొమ్మనేని శివ, నాయి బ్రాహ్మణ డైరెక్టర్లు ఆదినారాయణ, కడియాల కొండన్న, దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ ఇమామ్ హుస్సేన్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్, ఏపీఐఐసి కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్, జిల్లా గ్రంధాలయం సంస్థ సెక్రెటరీ కమ్మన్న, సమగ్ర శిక్ష ఏపిసి శైలజ, ఆయా సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.*
