Latest Posts

తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్..

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా….

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల దోషి అసదుల్లా అక్తర్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అసదుల్లా అక్తర్‌కు విధించిన మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు గురువారం తాత్కాలికంగా స్టే విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అక్తర్….

రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. గురువారం నుంచి అధికారులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తొలుత దృష్టి సారించారు.   ఎట్టకేలకు తెలంగాణలో కేసులపై సీబీఐ….

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఖరారైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు…..

AP

తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన..! చేతికి జియో ట్యాగింగ్..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రక్షణ, సౌకర్యం కోసం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు జియో ట్యాగ్ ను గురువారం ఉదయం నుంచి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇవాళ 2350 మందికి డిజిటల్ జియో ట్యాగ్ లను….

AP

సీఎంకే నోటీసులు పంపిస్తారా..? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం..

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సీఐ శంకరయ్య అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించడంతో ఆయన టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. తనపై చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా….

AP

డిప్యూటీ సీఎం పవన్ హామీతో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన విరమణ..

కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వారి ఆందోళన నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే….

దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

దేశంలోని వైద్య సంస్థలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రాయోజిత పథకం స్టేజ్-IIIను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల పరిమితితో 5,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్….

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు..! ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు సిఫారసు..

తెలంగాణలో సంచలనమైన ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేసింది. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్….

GHMC కీలక నిర్ణయం..! తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పు..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఫ్లై ఓవర్….