Latest Posts

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైభవంగా పంచాంగ శ్రవణం

శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం,
కదిరి,సత్యసాయి జిల్లా
తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం పటించారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి అనేకమంది భక్తులు పాల్గొన్నారు. పండితులు ఈ కార్యక్రమంలో” “లోక సమస్త సుఖినోభవంతు”, అనగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని భక్తులకు విన్నవించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం
శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పంచాంగ శ్రవణంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్డిఓ శర్మ గారు పాల్గొన్నారు.

Posted Under AP
Editor