Latest Posts

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పింఛన్ల పెంపుపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హర్షం

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి పత్రిక సమావేశంలోని అంశాలు

> కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

> రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

> సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా, వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది.

> 40 శాతం, అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.

> ఈ పథకాన్ని మార్చి 18న గుంటూరు బస్ స్టాండ్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు.

డిసెంబరులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ.. :

> గత ఏడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. వారికి ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారు.

> అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటి.

2026, ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. 2026 ఫిబ్రవరి 28న ఉత్తర్వు జారీ చేశారు.

> కేవలం రెండు నెలల్లోనే ఇచ్చిన హామీని అమలులోకి తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.

> ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర (ఇంటర్ప్రైట్), సప్తగిరి ఎక్స్ప్రెస్ (తిరుమల ఘాట్లో తిరిగేవి), అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసుల్లోని టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇకపై జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది.

> తాజా ఉత్తర్వు నేపథ్యంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు.

> మిగిలిన నాన్స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది.

> రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారుల సమాచారం.

> ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్ వినియోగించుకుంటున్నారు.

దివ్యాంగులకు మొదటి నుంచి టీడీపీనే ప్రాధాన్యత ఇస్తుంది :

> మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే.

> టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశాం.

> దివ్యాంగుల కోసం టీడీపీ అమలుచేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.

> టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు చేసినట్లే దివ్యాంగులకూ ప్రత్యేక రాయితీ రుణాలు పథకం అమలు చేసింది.

> కార్పొరేషన్ తో పని లేకుండా నేరుగా ప్రభుత్వమే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించింది.

> ఇలా ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.26 కోట్లతో 3,540 మందికి ఆర్థిక భరోసా లభించింది.

> దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా టీడీపీ అమలు చేసిన రాయితీ రుణాలు మంజూరు ప్రక్రియను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపివేశారు. ఈ నిర్ణయం దివ్యాంగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది.

> టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే 40 శాతం నుంచి 79 శాతం వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు అప్పటివరకు అందుతున్న రూ.500 పింఛన్ను రూ.1000కి పెంచింది.

> 90 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ.1500 చేసింది.

> 2019లో 79 శాతం లోపు వైకల్యం ఉన్న వారికి రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.3 వేలు చొప్పున అందించింది.

> ఇలా ఐదేళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛన్ మొత్తన్ని రూ.500 నుంచి రూ.2 వేలు, రూ.3వేలకు పెంచడంతో కొందరికి 300 శాతం, మరికొందరికి 500 శాతం పెరిగింది.

> 2019 జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైకల్య శాతంతో పని లేకుండా పింఛన్ అందరకీ ఒకేలా అందజేశారు.

> వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గాలికి వదిలేసింది.

> ఐదేళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారు.

> దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు నోచుకోవటం లేదు.

> వికలాంగుల సమస్యలపై గత ప్రభుత్వ పెద్దలకు, అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం.

> కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్ ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే.

> మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంvu కోసం 2025 – 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో -రూ.4,332 కోట్లు, 2026-27 బడ్జెట్లో రూ.4,582 కోట్లు కేటాయించారని

పత్రిక సమావేశంలో తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,
ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రవేశపెట్టిన పథకాల మూలపురుషుడు మన ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పథకాల గురించి వివరించిన మన కదిరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారికి, ఈ పత్రిక సమావేశంలో పాల్గొన్న విలేకరులందరికీ YES9 టీవీ తరపున ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

Posted Under AP
Editor