అనంతపురం జిల్లా, టౌన్.
*నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి*
– *: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*
– *: నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం*
– ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. మనకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు జరుగుతున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని.. అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జశ్వంత్ రావు, వైద్యం, విద్య, మెప్మా, ఐసీడీఎస్, రెవెన్యూ, డిఆర్డిఏతో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి నిధుల కేటాయింపుల గురించి ఎమ్మెల్యే వివరించారు. అనంతపురం అర్బన్ నియోజరవర్గంలోని ప్రధాన శాఖలకు మొత్తం రూ.475 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇందులో సింహభాగం ఆరోగ్య శాఖకు 210 కోట్లు ఉందన్నారు. జిల్లా మొత్తం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం 11.3% వాటాను అందిస్తోందన్నారు. ఇందులో రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు ప్రధాన శక్తులుగా ఉన్నాయని చెప్పారు. విద్య 25 కోట్లు, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లు 21 కోట్లు, వ్యవసాయానికి 16 కోట్లు, పురపాలక పరిపాలనకు 5 కోట్లు కేటాయించారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 117 కోట్లు, తల్లికి వందనంకి 39 కోట్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లకు 21 కోట్లు, స్త్రీ శక్తికి 2 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవకు 2కోట్లు, అన్నదాత సుఖీభవకు కోటి రూపాయలు చొప్పున కేటాయించినట్టు తెలిపారు. ఓ వైపు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో మనం ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాఖల వారికి సరైన ప్రణాళిక ఉండాలన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరింత శ్రమించి మనం పని చేయాల్సి ఉందన్నారు. కష్టకాలంలో కూడా నియోజకవర్గానికి ప్రధాన్యత ఇస్తూ..నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
