Latest Posts

రాయదుర్గం సమీపంలో ఘోర ప్రమాదం: కూలీల ఆటోను ఢీకొన్న బైక్.. పది మందికి తీవ్ర గాయాలు!

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం
* ఆరుగురికి గాయాలు

మండలంలోని కెంచనపల్లి ప్రభుత్వ పాఠశాల సమీపంలో మంగళవారం ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో పది మంది కూలీలు మల్లికార్జున, చిట్టెమ్మకు,
కావేరి,చిట్టి, బేబీ, సరోజమ్మకు,
నగేష్, చిట్టెక్క,మహాలక్ష్మి,
చిట్టి, గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన కూలీలు బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో రైతు పొలంలో పనులు ముగించుకొని ఆటోలో స్వగ్రామమైన మల్కాపురానికి తిరిగి వస్తుండగా, రాయదుర్గం మండలం కెంచనపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న మహిళా కూలీలు గాయపడ్డారు.
ప్రమాదంలో చిట్టెమ్మకు ఎడమ చేయి విరగగా, మల్లికార్జున అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరో కొంతమందికి తలకు, మరొకరికి కన్ను కు గాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనదారుడు శివానంద భరత్ సహా మొత్తం పది మంది గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మరో ఆటోలో రాయదుర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మల్లికార్జున తో పాటు మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడు శివానంద భారతికి తీవ్ర గాయాలు కావడంతో మరో ఆరు మందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Posted Under AP
Editor