Latest Posts

అనంతలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై చైతన్య ర్యాలీ…

అనంతపురం జిల్లా.

 

*ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం నగర ప్రజలను చైతన్య పరుస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గల అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ వారి ఆధ్వర్యలో మంగళవారం ఉదయం 7 గంటలకు నగరంలోని కృష్ణ కళా మందిరం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. మళ్లీశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ గుజ్జల హేమలత జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, జిల్లా పరిషత్ కార్యాలయం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ నినాదాలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. దీంతో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమంలో సర్వజనాస్పత్రి వైద్యులు డాక్టర్ హరిణి, డాక్టర్ రాధిక, డాక్టర్ శంకర్ నారాయణ, డాక్టర్ ప్రసూన, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్.డీ.ఎస్) నభ్యులు రత్నమయ్య. నరసింహులు, అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ స్టాఫ్ నర్సులు సునీత, మానస, బోయ సుకన్య, హైమావతి, రమాదేవి, పల్లవి, రాధ, ఎం.ఎన్.ఓలు వెంకటసాయి, వెంకటనారాయణ, సెక్యూరిటీ సిబ్బంది సుగుణ, శోభా, జుబేదా. లక్ష్మీప్రసన్న, శ్రీకాంత్, ప్రభు, నాగరాజు, అమర్నాధ్, ల్యాబ్ టెక్నిషియన్ కామేశ్, రేడియోగ్రాఫర్ నరసింహ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, నిర్మల కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీసాయి నర్సింగ్ కాలేజ్, ఆదర్శ్ నర్సింగ్ కాలేజ్, ఏఎన్ఎం, పీవీకేకే ఫార్మసీ, హోమియో ల్యాబ్ టెక్నిషియన్లు, ఐఎంఏ, ఐఏపీ సభ్యులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor