ముదిగుబ్బ మండలానికి చెందిన మైనారిటీ నాయకులు ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ నందు జరిగిన గ్రీవెన్స్ లో ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి గారికి వినతిపత్రం…
ముదిగుబ్బYes9Tv
ముదిగుబ్బ స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, ముదిగుబ్బ సిపిఎం పార్టీ కార్యదర్శి పెద్దన్న, ముదిగుబ్బ సిఐటియు కన్వీనర్ బాబ్జాన్, ట్రాన్స్ పోర్ట్ జిల్లా నాయకులు ఎస్,రఫీ, ముదిగుబ్బ మండలానికి చెందిన మైనారిటీ నాయకులు/ప్రజలు ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ నందు ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది* ముదిగుబ్బలోని కస్తూరిబాయి కాలనీలో మైనార్టీలకు చెందిన దాదాపు 50 కుటుంబాలు నివాసముంటున్నారు, కాలనీలో ఉన్నటువంటి మైనారిటీలు నమాజ్ చదవలంటే మసీదు కొరకు దాదాపు రెండు కిలోమీటర్లు టౌన్లోకి వెళ్లాల్సి వస్తోంది,కావున అధికారులు స్పందించి కస్తూరిబాయి కాలనీలో నివాసముంటున్న మైనార్టీ సోదరులకు మసీదు కొరకు స్థలం కేటాయించి సహకరించాలని
ఆర్డీవో గారికి విన్నవించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మక్కామసీద్ ముతపల్లి నూర్ మొహ్మద్ గారితోపాటు 20 మంది మైనార్టీ సోదరులు పాల్గొనడం జరిగింది..
ముదిగుబ్బ మండలానికి చెందిన మైనారిటీ నాయకులు ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ నందు జరిగిన గ్రీవెన్స్ లో ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి గారికి వినతిపత్రం…
