ఉపాధి హామీ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు

ఎస్ 9న్యూస్
కూడేరు జూలై 27
అనంతపురం జిల్లా ఇన్చార్జ్

కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తేటతెల్లం కావడంతో స్థానిక కలగల్ల గ్రామానికి చెందిన హరికృష్ణ ఆధారాలతో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ఉపాధి హామీలులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు, మాస్టర్లు, ఫోటో క్యాప్చర్, పేమెంట్ బిల్లులు లో చోటుచేసుకున్న అవకతవకలు వాటి ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ సమర్పించారు. అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధితులైన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని తక్షణమే బాధితులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Posted Under AP
Editor