నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేడు ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉండటంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పోటీ తీవ్రంగా ఉండటంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ఆళ్లగడ్డను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆళ్లగడ్డలో హైటెన్షన్: పోటాపోటీగా నేడు నామినేషన్ల పర్వం..
