Latest Posts

ముదిగుబ్బలో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి: అధికారులను డిమాండ్ చేసిన కూటమి నాయకులు!

ముదిగుబ్బ, యస్ 9
ముదిగుబ్బ టు కదిరి జాతీయ రహదారి రైల్వే వంతెన ముదిగుబ్బ పుట్టపర్తి రైల్వే బ్రిడ్జి ఎన్ హెచ్ ఎస్ సి సంజీవ రాయుడు ఎన్ హెచ్ డి ఈ గిడ్డయ్య అధికారులతో సమావేశం ముదిగుబ్బకు సంబంధించి రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ దగ్గర్లో ముదిగుబ్బ అసెంబ్లీ కానున్న నేపథ్యంలో ముదిగుబ్బకు రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని అధికారులను డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి రమేష్ బాబు మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు మాలిపాటి రామకృష్ణ వెంగనాయుడు కోట్ల బాబి నాయకులు పాల్గొన్నారు

Posted Under AP
Editor