Latest Posts

ఫ్రీ హోల్డ్ భూముల రైతులకు పంట రుణాలు రెన్యువల్ చేయాలి: ముదిగుబ్బ కెనరా బ్యాంక్ మేనేజర్‌కు సిపిఐ వినతి!

ఫ్రీ హోల్డ్ భూముల రైతుల పంట రుణాలను బ్యాంకు రికార్డులతో సంబంధం లేకుండా వన్ బి పేపర్ ఆధారంగా చేసుకొని గతంలో మాదిరి తక్షణమే రెన్యువల్ చేయాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు బుధవారం ముదిగుబ్బ కెనరా బ్యాంక్ మేనేజర్ నరసింహులు కు విజ్ఞప్తి చేశారు, ఖరీఫ్ సీజన్ పంట రుణాల ప్రక్రియలో భాగంగా ఫ్రీ హోల్డ్ జాబితాలో ఉన్న భూముల వివరాలు తమ బ్యాంకు రికార్డుల్లో (వెబ్ ల్యాండ్ లో) తొలగించబడ్డాయనే కారణంతో వాటిని రెన్యువల్ చేయడానికి కుదరదని తద్వారా వాటి మీద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ముదిగుబ్బ కెనరా బ్యాంకు వద్దకు వచ్చిన రైతులను ఆ బ్యాంక్ అధికారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బాధిత రైతులు తమ సమస్యను సిపిఐ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు, ఈ మేరకు ఆ పార్టీ మండల కార్యదర్శి
చల్లా శ్రీనివాసులు మంగళవారం
కెనరా బ్యాంక్ మేనేజర్ నరసింహులు తో మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూముల రైతులు తమ భూములకు సంబంధించి తహసిల్దార్, విఆర్ఓ సంతకాలతో కూడిన వన్ బి పేపర్ తీసుకొచ్చినా కూడా ఎందుకు రెన్యువల్ చేయడం లేదని తెలిపారు, బ్యాంక్ వెబ్ లాండ్ రికార్డులతో సంబంధం లేకుండా రెవెన్యూ వారు తాజాగా ఇచ్చే వన్ బి పేపర్ ఆధారంగానే రుణాలను రెన్యువల్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు, లేనిపక్షంలో రైతులతో కలిసి ఈ సమస్య విషయమై త్వరలోనే ఉద్యమిస్తామని తెలియజేశారు, ఈ సందర్భంగా మేనేజర్ నరసింహులు బ్యాంకు నుంచి ఫోనులో మండల తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి తో మాట్లాడారు, త్వరలోనే ఈ ఫ్రీ హోల్డ్ భూముల రైతుల పంట రుణాల రెన్యువల్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులకు వివరించారు,

Posted Under AP
Editor