రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారు
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో గల రెడ్డిపల్లి ప్రభుత్వ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యతను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వండిన పొంగల్ కోడిగుడ్డు , శనక్కాయ చట్నీ ఆహారాన్ని స్వయంగా ఎమ్మెల్యే తిని రుచి చూశారు. వంట స్టోర్ రూమ్ లో విద్యార్థులకు అందించే ఆహార వస్తువులను ఎమ్మెల్యే నాణ్యతను పరిశీలించారు. ఆహారాన్ని మరింత రుచిగా విద్యార్థులకు అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.
అదేవిధంగా పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని అక్కడున్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు సూచించారు.
రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పుట్టపర్తి శాసనసభ్యురాలు!
