అనంతపురం జిల్లా రాయదుర్గం
వైభవంగా శ్రీకొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం
*
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని తారకాపురం గ్రామంలో వెలసిన శ్రీకొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి రథోత్సవం మంగళవారం సాయంత్రం గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భారీ జన సంద్రోహం మధ్య జరిగింది. ఉదయం గంగజలం తెచ్చి మహాలక్ష్మీ అమ్మవారికి అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నందికొలు, వీరభద్ర కుణిత, మహిళా విరకాశి నాట్యాల మధ్య శ్రీ కొల్లాపురి ‘ మహాలక్ష్మీ రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరనూల్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
