ఎస్ఐఆర్ కార్యక్రమానికి గ్రామ ప్రజల విశేష స్పందన…

తాడిమర్రి( yes9tv )ఎస్ఐఆర్ కార్యక్రమానికి గ్రామ ప్రజల విశేష స్పందన
మర్రిమేకలపల్లి 32వ బూత్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
తాడిమర్రి, జూన్ 17: తాడిమర్రి మండలంలోని మర్రిమేకలపల్లి గ్రామం 32వ బూత్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో ఈరోజు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండలాధ్యక్షుడు దేవర రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.
అలాగే ఓటరు జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా సహకరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కృష్ణమనాయుడు, తాడిమర్రి మండల టీడీపీ మాజీ కన్వీనర్ కొణిదల వరప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రంగయ్య, బీఎల్ఓ రాజమోహన్, బీఎల్ఏ-2లు గంగయ్య, భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మండల కన్వీనర్ దేవర రాము మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor